Wednesday, November 5, 2025
E-PAPER
Homeజిల్లాలుసివిల్ సప్లై గోదాముల్లో ముక్కిపోతున్న బియ్యం

సివిల్ సప్లై గోదాముల్లో ముక్కిపోతున్న బియ్యం

- Advertisement -

90 టన్నుల దొడ్డు బియ్యం దుస్థితి

రేషన్ డీలర్ల వద్ద నిలువలపై సందిగ్ధం

నవతెలంగాణ అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లాలో 20 మండలాల పరిధిలో 7 సివిల్ సప్లై బియ్యం గోదాములు, 553రేషన్ షాప్ లున్నాయి. 2.50 లక్షలకుపైగా రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారు. ఈ గోదాముల నుంచి గ్రామాలలోని రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేసి రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసేవారు. ప్రస్తుతం రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. దీంతో గోదాములలో నిలువ ఉన్న దొడ్డు బియ్యం పరిస్థితి అధ్వానంగా మారుతున్నాయి. పురుగులు పట్టీ, తుట్టెలు కట్టీ 908 క్వింటాళ్లు ముక్కిపోతున్నాయి.

అచ్చంపేట గోదాం లో 25 టన్నుల 07 క్వింటాళ్ల27 కిలోలు, నాగర్ కర్నూల్ గోదాంలో 18 టన్నుల 9క్వింటాళ్ల 72 కిలోలు, బిజినపల్లి గోదాంలో 04 టన్నుల 1 క్వింటాళ్ల 78 కిలోలు, తెలకపల్లి గోదాంలో 02 టన్నుల 5 క్వింటాళ్ల

71 కిలోలు, కొల్లాపూర్ గోదాంలో 07 టన్నుల 02 క్వింటాళ్ల 61 కిలోలు, పెద్ద కొత్తపల్లి గోదాంలో 32 టన్నుల ఒక క్వింటాళ్ల 13 కిలోలు మొత్తం జిల్లాలో ఏడు పౌరసరఫరాల శాఖ గోదాములలో 90 టన్నుల 08 క్వింటాళ్ల 45 కిలోలు దొడ్డు బియ్యం తుట్టెలు కట్టి, పురుగులు పట్టి, ముక్కి మూలిగిపోతున్నాయి. ఇంకా గ్రామాలలో డీలర్ల వద్ద రేషన్ షాపులలో నిలువ ఉన్న దొడ్డు బియ్యం పై సందిగ్ధం నెలకొంది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యం గోదాములలో నిల్వ చేయడం పట్ల దొడ్డు బియ్యానికి పట్టిన పురుగులు సన్నబియానికి పడుతున్నాయి. కొల్లాపూర్ మండలంలో కొన్ని గ్రామాలు అమ్రాబాద్ ప్రజల మండలంలో కొన్ని గ్రామాలలో సన్న బియ్యంలో నువ్వులు వస్తున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. సివిల్ సప్లై గోదాములలో నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు తరలింపు చేయడంలో నిర్లక్ష్యం చేశారు. చేస్తున్నారు. కొన్ని లక్షలు విలువ చేసే బియ్యం ముక్కి మూలిగిపోవడం పట్ల అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్ స్పందించి గోదాములలో నిలువ ఉన్న బియ్యాన్ని తరలింపుకు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయ అవసరాలకు బియ్యాన్ని వినియోగించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -