నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం
భారత రాజ్యాంగంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని ఇబ్రహీంపట్నం ఆర్డిఓ కే అనంతరెడ్డి తెలిపారు. 16వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నంలో అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి ఆదివారం ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో భారత రాజ్యాంగం, ఓటు హక్కుపై విద్యార్థుల ద్వారా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర దేశాలతో పోలిస్తే భారత రాజ్యాంగం ఎంతో ప్రజాస్వామ్య యుతంగా పని చేస్తుందని తెలిపారు. భారత రాజ్యాంగం ద్వారా ఎన్నికైన ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లోనే అధికారం చేపడుతోందని గుర్తు చేశారు. కానీ ఇతర దేశాల్లో ఎన్నికలు పూర్తయి ఇప్పటికీ 600 రోజులు దాటిన ప్రభుత్వం అధికారాన్ని చేపట్టే లేదని తెలిపారు. అందుకు ఆ దేశాల్లో ప్రెసిడెంట్ పాలనే కారణమని గుర్తు చేశారు.
కానీ భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నిక చేసుకున్న ప్రభుత్వం వెంటనే అధికారం చేపడుతోందని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని మించిన రాజ్యాంగం మరో దేశానికి లేదని గుర్తు చేశారు. ఈ తరుణంలో ఓటు హక్కును సద్వినిగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఓటును దుర్వినియోగం చేయొద్దన్నారు. విద్యార్థులు, మేధావులు ఓటు హక్కు వినియోగించుకోకపోవడం వల్ల నిజమైన నాయకుడు ఎన్నిక కాకుండా పోతాడని ఇది భారత రాజ్యాంగానికి ప్రమాదమని గుర్తు చేశారు. ఓటు హక్కు ప్రాధాన్యత, 18ఏళ్లు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు కావడం, ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం ఎంతో అవసరం అన్నారు.
సర్పంచు, ఎంపీటీసీ, మున్సిపల్, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లోను యువతనే కీలకపాత్ర పోషించాలని తెలిపారు. ఓటు హక్కు నమోదు చేసుకోవడం నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే బిఎల్వోల ఆధ్వర్యంలో విచారణ చేసి ఓటు హక్కు కల్పిస్తామని తెలిపారు. భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కంకణ బదులు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మంచాల, యాచారం తహసిల్దార్లు సునీతా రెడ్డి, ప్రసాద్ రావు, అయ్యప్ప, డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాస్ గౌడ్, ఎన్నికల డిప్యూటీ తహసిల్దార్ ప్రవీణ్ తదితరులు ఉన్నారు.



