Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుభూభారతి ప్రకారం అసైన్డ్, ఇండ్ల స్థలాలకు హక్కులు కల్పించాలి

భూభారతి ప్రకారం అసైన్డ్, ఇండ్ల స్థలాలకు హక్కులు కల్పించాలి

- Advertisement -
  • రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి

నవతెలంగాణ-చండూరు: భూభారతి చట్టం ప్రకారం అసైన్డ్, ఇండ్ల స్థలాలకు హక్కులు కల్పించాలని రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. సోమవారం గట్టుప్పల మండల కేంద్రంలో రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సు రైతు సంఘం జిల్లా నాయకులు చాపల మారయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాదా బైనమాలకు ఇచ్చిన గడువు డిసెంబర్ 2023 వరకు పొడిగించాలని, భూభారతి రూల్స్ ప్రకారం షెడ్యూలు బి లో చెప్పినట్లు వారసత్వ పట్టాలకు ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదని ఆయన అన్నారు. అలాగు పార్ట్-2 కింద 18 లక్షల 48 వేల ఎకరాలకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామస్థాయిలో రెవిన్యూ ఆఫీసర్లను నియమించి, వాస్తవ భూమిసాగుదారుల పేర్లు రికార్డులో నమోదు చేయాలని ఆయన అన్నారు. రెవిన్యూ వ్యవస్థలను త్వరితగతిన పునరుద్ధరించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. రైతాంగం పోరాటాలు, ఆందోళనలు జరుపుతున్న భూ సమస్యల మాత్రం పరిష్కారం కావడం లేదని ఆయన అన్నారు. స్వాతంత్రం పూర్వం నుండి నేటికీ సమగ్ర భూ సర్వే జరగకుండా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధరణిని, భూభారతిని, దాని నిబంధనల్ని లోతుగా విశ్లేషిస్తే ఇంకా చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గట్టుపల మండలంలో ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చిన భూములను గత ప్రభుత్వం పల్లె పనాల పేరుతో ఆక్రమించుకుంది. ఆ ఇండ్ల స్థలాలను పాత పట్టాదారులకే ఇవ్వాలని, ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల చొప్పున మంజూరు చేయాలని ఆయన అన్నారు. గట్టుప్పల మండలంలో రైతులను ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారానికి త్వరితగతిన రెవెన్యూ సిబ్బందిని కేటాయించాలని ఆయన అన్నారు. భూ భారతి లోను లోపాలను కూడా సరి చేయాలని ఆయన అన్నారు. ధరణిలో ఉన్న లోపాలను అధిగమించామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ,రైతు సంఘం జిల్లా నాయకులు చాపల మారయ్య, కర్నాటి మల్లేశం, సాగర్ల మల్లేష్, జెర్రిపోతుల ధనుంజయ, మిర్యాల భరత్, వరికుప్పల ముత్యాలు,కర్నాటి సుధాకర్, పగిళ్ల శ్రీనివాస్, వేముల లింగస్వామి,కర్నాటి వెంకటేశం, పగిళ్ల యాదయ్య,పెద్దగాని నరసింహ, ముసుకు బుచ్చిరెడ్డి, పబ్బు మారయ్య, బండారి కృష్ణయ్య,ఈరటి వెంకటయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad