Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంలాస్‌వెగాస్‌ ఎయిర్‌పోర్టులో కలకలం.. ఎయిర్‌లైన్స్‌లో మంటలు

లాస్‌వెగాస్‌ ఎయిర్‌పోర్టులో కలకలం.. ఎయిర్‌లైన్స్‌లో మంటలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: లాస్‌వెగాస్‌ ఎయిర్‌పోర్టులో కలకలం రేగింది. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం గాల్లో ఉండగా ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్‌ లాస్‌ వెగాస్‌ ఎయిర్‌పోర్టులో విమానాన్ని తిరిగి ల్యాండ్‌ చేశారు. పైలట్‌, ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఘటన జరిగిన సమయంలో విమానంలో 153 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారని ఎయిర్‌లైన్స్‌ తెలిపింది.

ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తామని ఎఫ్‌ఎఫ్‌ఎ తెలిపింది.ఈ ఘటనపై ఏవియేషన్‌ వాచ్‌డాగ్‌ ఫెడరల్‌ ఏవియేషన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం 1665 బుధవారం ఉదయం 8:11 గంటలకు (స్థానిక సమయం) లాస్‌ వెగాస్‌లోని హ్యారీ రీడ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నార్త్‌ కరోలినాలోని షార్లెట్‌లోని షార్లెట్‌ డగ్లస్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది. టేకాఫ్‌ అయిన 10 నిమిషాల లోపే, దాని ఇంజిన్లలో ఒకదాని నుండి మంటలు, పొగలు రావడంతో పైలట్‌ లాస్‌ వెగాస్‌ విమానాశ్రయంలో 8.20కి సురక్షితంగా ల్యాండ్‌ చేసినట్లు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad