- కౌన్సిల్లో ఆకుల వసంత బైఠాయింపు
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మున్సిపల్‌లో రచ్చ కొనసాగుతోంది. మరోసారి సమావేశానికి హాజరు కాలేకు పోయిన ఆటో యాదగిరి సతీమణి కుటుంబ సభ్యులు కౌన్సిల్లోకి దూసుకు వచ్చారు. పోడియం ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. కౌన్సిలర్ ఆకుల యాదగిరిని రప్పించాలని అప్పటి వరకు ఎన్నిక ఆపాలని నినాదాలు చేశారు. భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతున్న ఆకుల యాదగిరి కుటుంబ సభ్యులు కౌన్సిల్లోకి వచ్చి ఆందోళన చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు ఆందోళనకారులను బయటకు తీసుకువచ్చారు. ఆర్డీవోతో ప్రత్యేకంగా మాట్లాడించారు. కాంగ్రెస్ సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
బీఆర్ఎస్ సభ్యులు ఆకుల యాగిరిని సమావేశానికి రప్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యులు ఒక్కసారిగా ఆ పొడియాన్ని చుట్టుపెట్టారు. అప్పటి వరకు సమావేశాన్ని వాయిదా వేయాలని పట్టుబట్టారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు కప్పరి స్రవంతి, ఇందూరు శ్రీనివాస్, నీలంబాను రాందాసు తదితర సభ్యులు ఒక్కసారిగా ఎన్నికల అధికారి కే అనంతరెడ్డిని చుట్టుముట్టారు. దీంతో మధ్యాహ్నం ఒంటిగంట వరకు సమావేశాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించారు.
మరోవైపు ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం పై రాళ్ల దాడులు ఆయా పార్టీల మద్దతుదారులు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళకారులను చెదరగొట్టారు. భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
కౌన్సిల్లో పార్టీలు బలాబలాలు..
మున్సిపల్ సమావేశానికి ఆకుల యాదగిరి మినహా ఎక్స్ అఫీషియ సభ్యులుతో కలుపుకొని 24 మంది హాజరయ్యారు. వీరిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కొన్ని ప్రవీణ్ కుమార్, జేర్కోని మమతా రాజు కేకుల సుదర్శన్ రెడ్డి, కొండ్రు శ్రీలత రాంబాబు, కొండిగారి త్రిలోక్, క్యామ శంకర్, అల్వాల జ్యోతి వెంకట రెడ్డి, మడుపు లక్ష్మమ్మ, మంద జయ, చిలకల బుగ్గరాములు, నీలం శ్వేత, గూడూరీ గిరీష్ హాజరుకాగా స్వతంత్ర అభ్యర్థి దాసరి మురళీకృష్ణ వీరి వెంట ఉన్నాను. ఇక బిజెపి మొదటి వార్డ్ అభ్యర్థి ముత్యాల శ్యామల భాస్కర్ బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నారు. ఇక కాంగ్రెస్ కౌన్సిలర్లను పరిశీలిస్తే..నీళ్ల భాను బాబు గౌడ్, మహమ్మద్ అమీనా బేగం,వి రాందాస్, దారు రాఘవేంద్రరావు, దొంతరమోని అని భార్గవి రాజు, ఇందూరి శ్రీనివాస్, ఏదులా విజయలక్ష్మి వెంకట్ రెడ్డి, కప్పర స్రవంతి చందు హాజరు కాగా బిజెపి కౌన్సిలర్ సిద్ధం భానుప్రియ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు. రంగారెడ్డి కాంగ్రెస్ వెన్నంటి ఉన్నారు.
రెండుగా చీలిన బీజేపీ..
ఇబ్రహీంపట్నంలో కేవలం రెండు వార్డుల్లో విజయం సాధించిన బీజేపీ రెండుగా చీలిపోయింది. ఒకరు ముత్యాల శ్యామల భాస్కర్ టిఆర్ఎస్‌కు మద్దతు ఇస్తుండగా.. 18వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన సిద్ధం భానుప్రియ మాత్రం కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారు. దీంతో బీజేపీలో వర్గపోరు బయటపడింది.






