– ఒక శాతం కంటే తక్కువగానే నమోదు
న్యూఢిల్లీ: జాతీయ వైద్య రిజిస్టర్‌లో (ఎన్‌ఎంఆర్) పేర్లు నమోదు చేసుకునేందుకు దేశంలోని ఆర్‌ఎంపీలు ముందుకు రావడం లేదు. దేశీయ ఆధునిక వైద్యంలో రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ల సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు ఈ కేంద్రీకృత వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే గత ఎనిమిది నెలల కాలంలో ఎన్‌రోల్‌మెంట్ కోసం కేవలం ఒక శాతం కంటే తక్కువగానే వైద్యుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. కేంద్ర రిజిస్టర్‌లో ఆర్‌ఎంపీలు తమ పేర్లను విధిగా నమోదు చేసుకోవాల్సి ఉన్నప్పటికీ ఆ పని జరగడం లేదు. అంతకంటే దిగ్భ్రాంతి కలిగించే విషయమేమంటే…వచ్చిన కొద్ది దరఖాస్తులలోనూ 98 శాతం ఆమోదం పొందలేదు. మన దేశంలో 13 లక్షల మందికి పైగా ఆర్‌ఎంపీలు ఉన్నారు. ఏప్రిల్ 24వ తేదీ వరకూ వీరిలో కేవలం 10,411 మంది నుంచి మాత్రమే జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ)కి దరఖాస్తు లందాయి. వీటిలోనూ 10,237 దరఖాస్తులు ఆమోదం పొందలేదు. 139 దరఖాస్తులకు సంబంధించి వైద్యుల నుంచి కొన్ని వివరణలు కోరారు. రెండు దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 2022 జూన్ నాటికి రాష్ట్ర వైద్య మండలులు (ఎస్‌ఎంసీలు), ఎన్‌ఎంసీలో 13,08,009 మంది అల్లోపతి వైద్యులు నమోదై ఉన్నారు.
వైద్య రిజిస్టర్‌లో పేర్లు నమోదు చేసుకోని ఆర్‌ఎంపీలు
- Advertisement -
RELATED ARTICLES