- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నగరానికి చెందిన ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. విద్యార్థినిని గండిమైసమ్మ ప్రాంతంలోని బాలాజీ నగర్‌కు చెందిన శ్రీను వర్మ కుమార్తె శ్రీజ వర్మ (23)గా గుర్తించారు. శ్రీజ ఉన్నత చదువుల కోసం కొంతకాలం క్రితమే అమెరికాకు వెళ్లింది. అక్కడ చికాగోలో నివసిస్తోంది. సోమవారం రాత్రి తాను ఉంటున్న అపార్ట్‌మెంట్ నుంచి దగ్గర్లోని రెస్టారెంట్‌కు డిన్నర్ చేసేందుకు నడుచుకుంటూ వెళ్లింది. ఈ క్రమంలో ఓ ట్రక్కు శ్రీజను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీజ.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
- Advertisement -