నవతెలంగాణ – హైదరాబాద్ : ఈరోజు ఉదయం బీహార్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మృతి చెందారు. ఆటో – హైవా లారీ ఢకొీనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన డానియావాన్ బ్లాక్ పరిధిలోని షాజహాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డానియావాన్ – హిల్సా రహదారిపై శనివారం ఉదయం 6.45 గంటల సమయంలో జరిగింది. ఈ ప్రమాదంలో మృతి చెందినవారంతా నలందా జిల్లాలోని రెడ్డి మలామా గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. వారంతా త్రివేణి సంగమం వద్ద గంగానదిలో స్నానమాచరించడానికి ఫతుహాకు వెళుతున్నారు. అయితే మార్గమధ్యలోనే రోడ్డు ప్రమాదంలో వీరంతా మృతి చెందారని పోలీసులు తెలిపారు. అయితేఈ ఘటనలో గాయపడిన వారు పాట్నా మెడికల్ కాలేజీ హాస్పిటల్ (పిఎంసిహెచ్) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పాట్నా జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు.ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. గాయాలపాలైన ఐదుగురిని తక్షణమే చికిత్స కోసం పిఎంసిహెచ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి సరైన చికిత్స అందిస్తున్నారు. మృతుల బాధిత కుటుంబాలకు తగిన సహాయం అందిస్తాం. ఈ సందర్భంగా మృతులకు జిల్లా మెజిస్ట్రేట్ సంతాపం వ్యక్తం చేశారు.
బీహార్ లో రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES