నవతెలంగాణ-హైదరాబాద్: దట్టమైన పొగమంచు కారణంగా ఇటీవల పలుమార్లు రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో పలు రోజుల క్రితం భారీ స్థాయిలో వాహనాలు ఢీకొన్నాయి. పొగమంచుతో ఎదురుగా వచ్చే వాహనాలు కనపడకపోవడంతో బహుళ సంఖ్యలో వాహనాలు ఢీకొంటున్నాయి. తాజాగా హర్యానాలో పొగమంచు కారణంగా మరో ప్రమాదం జరిగింది. బహల్‌గఢ్ సమీపంలో ఢిల్లీ-సోనిపట్ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో కనీసం ఒకరు లేదా ఇద్దరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసమైయ్యాయని చెప్పారు. ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక కారు మొదట మరొక వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత ఈ ప్రమాదం జరిగిందని. “మొదట, ఒక కారు మరొక కారును ఢీకొట్టింది. తరువాత, ఒక కారు వెళ్లిపోయింది, మరొకటి అలాగే ఉండిపోయింది. కొద్దిసేపటి తర్వాత, మరొక కారు వచ్చి వెనుక నుండి దెబ్బతిన్న కారును ఢీకొట్టింది” అని తెలిపారు.
పొగమంచుతో హర్యానాలో రోడ్డు ప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



