నవతెలంగాణ-హైదరాబాద్: వరుసగా నాలుగు బస్సులు ఢీకొనడంతో 35 మంది అమరనాథ్ యాత్రికులకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. శనివారం ఉదయం పహల్గామ్ వెళుతున్న ఐదు బస్సుల్లో ఆగి ఉన్న కారుని ఓ బస్ ఢికొట్టింది. దీంతో వరుసగా నాలుగు బస్సులు ఒకదానికొకటి డీకొన్నాయి. ఈ ప్రమాదంతో 35 మంది యాత్రికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన జమ్మూకాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలోని చందర్‌కోట్ వద్ద జరిగింది. క్షతగాత్రులను చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు సీనియర్ సూరిటిండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పి) రాంబన్ కుల్బీర్ సింగ్ తెలిపారు. వీరిలో ముగ్గురు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారు అమర్‌నాథ్ యాత్రను కొనసాగించలేకపోవచ్చని ఆయన అన్నారు. మిగిలిన యాత్రికుల కోసం బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. బస్సు బ్రేక్ ఫెయిలవ్వడం వల్లే కాన్వారుని ఢకొీట్టిందని ప్రాథమిక అంచనాకొచ్చినట్లు ఎస్‌ఎస్‌పి రాంబన్ కుల్బీర్ సింగ్ వెల్లడించారు. ప్రమాదానికి గురిచేసిన బస్సు మధ్యప్రదేశ్‌కి చెందిన ప్రయివేటు బస్సుగా పోలీసులు గుర్తించారు.
