Sunday, August 3, 2025
E-PAPER
Homeజాతీయంకాశ్మీర్‌లో రోడ్డు ప్ర‌మాదం..ఇద్దరు మృతి

కాశ్మీర్‌లో రోడ్డు ప్ర‌మాదం..ఇద్దరు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: జమ్ముకాశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఎస్‌యువి అదుపుతప్పి లోయలోపడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఐదుగురు ప్రయాణికులు పంజాబ్‌ నుండి అమర్‌నాథ్‌యాత్ర కోసం పనిచేసే కమ్యూనిటీ కిచెన్‌ సభ్యులుగా పేర్కొన్నారు.

ఆదివారం తెల్లవారుజామున జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారి వెంబడి చందర్‌కోట్‌లోని క్యాంప్‌సైట్‌కు వెళుతుండగా కథువా సమీపంలో ఎస్‌యువి లోయలోపడినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ప్రారంభించారని, ఐదుగురిని ఆస్పత్రికి తరలించారని అన్నారు. మెహిందర్‌ పాల్‌ (60), పవన్‌ మధన్‌ (50)లు ఆస్పత్రి చేరుకునే లోపే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -