- Advertisement -
చండీగఢ్: ఒక ఇన్నోవా కారును టిప్పర్ ఢకొీట్టిన ఘటనలో ఏడుగురు మరణించిన ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పాటియాల నగరంలో బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న ఇన్నోవా కారును ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో కారు మొత్తం నుజ్జునుజ్జయ్యింది. కారులో ఉన్న ఏడుగురు మరణించారు. మృతుల్లో ఆరుగురు విద్యార్థులు, కారు డ్రైవర్ ఉన్నారు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు గాయపడిన విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -