నవతెలంగాణ-హైదరాబాద్ : లారీ, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పర్వతగిరి మండలం ఈదులగడ్డ తండాకు చెందిన ధరావత్ రామ్‌దన్ (45) మంగళవారం తన ద్విచక్ర వాహనంపై తొర్రూరు నుండి తిరుమలగిరి వైపు డీకే తండాకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ముందుగా వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో రామ్ దన్ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నాడు.
ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య మంగమ్మతో పాటు ముగ్గురు కుమారులు శ్రీధర్, మధుకర్, సతీష్, ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వర్ధన్నపేట ఏరియా దవాఖానకు తరలించారు. బాధితుని పెద్ద కుమారుడు శ్రీధర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ ఉపేందర్ తెలిపారు.
లారీని ఢీ కొట్టిన బైక్, వ్యక్తి మృతి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES