- Advertisement -
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్ సేఫ్టీ కార్యక్రమం.. మంగళవారం పంతంగిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.మన్మధ కుమార్ పర్యవేక్షణలో గ్రామస్థులతో విలేజ్ లెవెల్ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 55 మంది గ్రామస్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ జి మన్మధ కుమార్ మాట్లాడారు. రవాణా నియమాలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపకూడదని ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్లు ఎస్. కృష్ణ మాల్ కె.ఉపేందర్ రెడ్డి బి.అజయ్ భార్గవ్ కానిస్టేబుల్స్ సిబ్బంది నరేష్,సైదులు తదితరులు పాల్గొన్నారు
- Advertisement -



