కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకోవాలి
కేవిపీఎస్ జిల్లా కార్యదర్శి అత్కూరి శ్రీధర్
నవతెలంగాణ – కాటారం
నాసిరకమైన రోడ్డు వేస్తున్న కాంట్రాక్టర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని అత్కూరి శ్రీధర్ రోడ్డును పరిశీలించి ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈ సందర్బంగా అత్కూరి శ్రీధర్ మాట్లాడుతూ…జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం నుండి మహాముత్తారం మండల లోని పెగడపల్లి వరకు రూ.16 కోట్లతో నాణ్యత లేని రోడ్డు వేయడం వలన వేసిన నాలుగు ఐదు రోజులకే రోడ్లు పగుళ్లు తేలడం, రోడ్డు కుంగిన కాడ డెత్ రోడ్ వేసుకోవడం వల్ల మళ్లీ పగులు తేలడం జరుగుతుందని ఆరోపించారు. ఆర్ అండ్ బి అధికారులు కాంట్రాక్టర్ ఇచ్చే కమిషన్లు కక్కుర్తి పడి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని మండి పడ్డారు. రోడ్డు ప్రారంభమైన కానుండి ఇప్పటివరకు పరిశీలించింది లేదు ఆ కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలన్నారు. మళ్లీ రోడ్డు పునర్నిర్మానం చేయాలని అయినా అన్నాడు. లేని యెడల ప్రజల సంఘాల ను కాల్పుకొని పెద్ధ ఎత్తున ఉద్యమం చేస్తామని హేచ్చరించారు.
తూతూ మంత్రంగా రోడ్డు పనులు
- Advertisement -
- Advertisement -



