Tuesday, February 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనెదర్లాండ్‌ ప్రధానిగా రాబ్‌ జెట్టెన్ ప్రమాణ స్వీకారం

నెదర్లాండ్‌ ప్రధానిగా రాబ్‌ జెట్టెన్ ప్రమాణ స్వీకారం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: నెదర్లాండ్‌ ప్రధానిగా రాబ్‌ జెట్టెన్‌ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. డచ్‌ రాజకీయాల్లో అతి పిన్న వయస్కుడైన ప్రధానిగా జెట్టెన్‌ చరిత్ర సృష్టించారు. హౌస్‌టెన్‌ బాష్‌ ప్యాలెస్‌లో మంగళవారం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. శరణార్థుల విధానంపై తీవ్ర విమర్శలు ఎదురవడంతో డిక్‌ స్కూఫ్‌ నేతృత్వంలోని అతిమితవాద ప్రభుత్వం 11 నెలల క్రితం కుప్పకూలిన సంగతి తెలిసిందే. అనంతరం గతేడాది అక్టోబర్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డెమోక్రాట్స్‌ (ప్రొగ్రెసివ్‌ లిబరల్స్‌ (డి66))కి చెందిన రాబ్‌ జెట్టెన్‌ అనూహ్య విజయం సాధించారు.

‘సహకారంతో విభేదాలను అధిగమించడం తన లక్ష్యం’ అని ప్రమాణ స్వీకారం అనంతరం రాబ్‌ జెట్టెన్‌ సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. అలాగే స్వలింగ సంపర్కుడిగా బహిరంగంగా వెల్లడించిన దేశంలోని మొదటి నేత కూడా ఆయనే కావడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -