Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeసోపతిరాకీ బందనం - జెండా వొందనం

రాకీ బందనం – జెండా వొందనం

- Advertisement -

మూడ్‌ దినాల సంది ఆన ఒడిసిందే లేదు, తల్సుకొని తల్సుకొని ఎడ్సినట్టు పావ్‌ పావ్‌ గంటకి జల్లు లాయె. ఈ దినం కొంత ఎండ గానొచ్చింది, రాకీ పండగకి పిల్లలు రాకీలు ముద్దుగా సిద్దాం సేస్కుండ్రు, కట్టేటోళ్లు కట్పించుకునేటోళ్లు గూడ చెత్రి పట్టుకొని, వాన కవర్లు కప్పుకొని రావాల్సి వచ్చింది.
మంచి బట్టలు కట్కొని ఆడుకుంటా పాడుకుంటా ఖుషి చేయలేక పోయిండ్రు పాపం వైష్ణవి, అర్చన చెత్రి పట్కొని సీటు ఇయ్యానికే అచ్గి తల్పుకొట్టి, ”తమ్మునికి కట్టినం గాని అన్నలోస్తలేరంట ఆధ్వరం ఏదో ఎక్సమ్‌ ఉంది, టైం తక్వుంది సద్వేది శ్యాన ఉంది అడికి వస్తే డిస్టప్‌ అయితది మల్లి ఎక్సమ్‌ టైంకి రాజల్ము అని యాదిలాల్‌ కాక కలిస్తే జెప్పిండ్రంట” అని జెప్పంగానే పాప్మన్పించే.
”ఎందుకట్ల ఉదాస్‌ అయితుండ్రు ఈ దినం రాకుంటే అన్నల్‌ గారా మీరు అన్నల్‌ కొరకు ఎం గోరుకుంటారు, బాగా సద్వి పెద్ద కొలవులు సెయ్యాలని కద. రాకి కోసం ఎక్సమ్‌ మానుకుంటారా ఎట్లా? మనౌకుంతె కొల్వెడ అస్తది రాకీలా పున్నమ్‌ ఎటేటకి ఆస్తాయి. మి అన్న లేమన్నా సీక్రినుల ఆడ ఉంది ఈడ గూడ ఉండనికి ఈష్ణు మూర్తులైతే గద్ద మీద ఎక్కి ఊరుకోదురు”.
అనంగానే ఇద్దరు ఓంపుల్‌ దిరిగి నవ్వ వట్టిండ్రు,” పోయి దేవునుకద రాకీలు పెట్టి మొక్కుండ్రి మా అన్నలు ఎక్సమ్‌ లు మంచిగా రాపించు అని మొక్కుండ్రియని” పంపిన.
పట్నం నుండు పర్సురామ్‌ పోన్‌ జేసి ”పద్దక్క,జెర నువ్వు అల్వెలకక థాంకెళ్లి సమాజాయించ జాల్తావా నేను రేపు ఆడికి అస్తలేన్‌ కొల్వు ల కొత్తగా జెర్తి గదా నెల గాలే తనకా పడలే సెలవు కుడా ఇయ్యనంటుందు సేటు, రానికే పోనికే పైసల్‌ గావాలె అక్కకి గూడ ఎం అన్న ఇయాలె గదా ఎవరినన్నా ఉద్దేరా అడగనికే ఈడ అంత కోతోలైరి అక్క నరాజైతేద్దామని భయమైతుంది”. నాకు ఎట్లనొ అయింది.
గాదెంది పర్సు రాకి గట్టేడిది పైసల కొరకేనా? ఇప్పుడు కట్టకుంటే నువ్వు తమ్మునివి కావా ఆమె అక్క గదా నువవ్‌ గట్లేమనుకోకు నా పోన్‌తో మాట్లాడిస్తాలే ఏ డోళ్లు ఆడనే ఉంది ఒకరికొరకు ఒకరు పార్ధించుకోండి అయిపై నల్దినాలైతే మూడ్‌ దినాలు సెల్వు లొస్తాయి గదా గప్పుడైనా రకి కట్కోవొచ్చు సీట్‌ తింపించుకునొచ్చు గాడేమన్నా పాస్‌ పోయేదిదా,అంటి.
ఎట్లైనా కట్టిన కట్టకున్న రాకి ఈల్వ రాకిదే ఎంకటికి రాకితోని ఇద్దాలే మాఫయినాయంట పగలు మర్శి సేతులు గల్పి నవ్వుకుందురంట, నాలిదినాలా 15 ఆగస్టు ప్రముక టీచర్‌ వాళ్ళ అక్క తోని పాట రాపించుకొచ్చి పిల్లలకు నేర్ప మొదలెట్టింది, ”మన జెండా మన అండ మనమే జెండాకు అండ”, అలవొదినను పిల్సి పిల్లల్తో పాక్టీస్‌ సేయించలే.

– గంగరాజ పద్మజ,
9247751121

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img