- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బొప్పన్న.. అంతర్జాతీయ టెన్నిస్‌కు అధికారికంగా గుడ్‌బై చెప్పాడు. గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన నలుగురు భారతీయ ఆటగాళ్లలో అతనొక్కడు. ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు శనివారం రోహన్ బొప్పన్న పేర్కొన్నాడు. టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన విషయాన్ని అతను తన ఎక్స్‌లో పోస్టు చేశాడు. దాదాపు రెండు దశాబ్ధాల పాటు అతను టెన్నిస్ కెరీర్‌ను కొనసాగించాడు. 45 ఏళ్ల ఉన్న బొప్పన్న చివరి సారి పారిస్ మాస్టర్స్ ఆడాడు. ఆ టోర్నీలో కజక్ ప్లేయర్‌తో జోడి కట్టాడు.
- Advertisement -



