ముంబయి: టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రోహిత్ శర్మను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఘనంగా సన్మానించారు. బుధవారం ముంబయిలోని తన నివాసంలో రోహిత్ శర్మను అభినందించారు. ఇటీవల రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఫడ్నవీస్ అభినందనలు తెలుపుతూ.. భారత క్రికెట్‌కు చేసిన సేవలను ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఫడ్నవీస్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రోహిత్‌ను కలిసిన ఫొటోలను షేర్ చేస్తూ ఫడ్నవీస్.. ‘భారత క్రికెటర్ రోహిత్ శర్మకు స్వాగతం. రోహిత్‌ను కలిసి మాట్లాడడం చాలా బాగుంది. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం.. భవిష్యత్‌లో విజయం సాధించేందుకు శుభాకాంక్షలు తెలిపాను’ అంటూ పేర్కొన్నారు. మే 7న టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు రోహిత్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.