నవతెలంగాణ-హైదరాబాద్: భారత వెటరన్ బ్యాటర్ రోహిత్ శర్మ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. అది కూడా కేవలం ఒక్క పాయింట్ తేడాతో కోల్పోవడం గమన్హారం. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో సెంచరీ చేసిన న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్(782 పాయింట్లు) రెండు స్థానాలు ఎగబాకి టాప్ ప్లేసుకు చేరుకున్నాడు. రోహిత్ (781 పాయిట్ల) రెండో స్థానానికి పడిపోయాడు. అఫ్గానిస్థాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ (764), శుభ్‌మన్ గిల్ (745), విరాట్ కోహ్లీ (725) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
ఇక కోల్‌కతా వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో అర్ధ శతకం చేసిన సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బావుమా రెండు స్థానాలు జంప్ ఎగబాకి ఐదో స్థానానికి చేరుకున్నాడు. యశస్వి జైస్వాల్ ఐదు నుంచి ఏడో ర్యాంకుకు పడిపోగా.. శుభ్‌మన్ గిల్ రెండు స్థానాలు మెరుగై 11వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ నాలుగు స్థానాలు దిగజారి 12వ ర్యాంకులో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో సౌతాఫ్రికాతో తొలి టెస్టులో ఆరు వికెట్లు పడగొట్టిన జస్‌ప్రీత్ బుమ్రా టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. కుల్దీప్ యాదవ్ రెండు స్థానాలు మెరుగై 13వ ర్యాంకులో ఉన్నాడు. కల్దీప్ కెరీర్‌లో బెస్ట్ ర్యాంక్ ఇదే. రవీంద్ర జడేజా నాలుగు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకుకు చేరుకున్నాడు.



