నవతెలంగాణ హైదరాబాద్: టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ప్రకటించాడు. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని సోషల్ మీడియా పోస్టు పెట్టాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వపడుతున్నానని అందులో పేర్కొన్నాడు. 38 ఏండ్ల రోహిత్ 2013లో టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. 67 మ్యాచ్‌లు ఆడి 4301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 అర్ధ సెంచరీలున్నాయి. రోహిత్ ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. హిట్‌మ్యాన్ భారత్ తరఫున ఇక వన్డేల్లో మాత్రమే కొనసాగుతాడు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ఇండియా రెండుసార్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో ఫైనల్‌కు చేరింది. జూన్‌లో టీమ్ఇండియా ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ కెప్టెన్సీ రేసులో ఉన్నారు. ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
టెస్ట్ క్రికెట్‌కు ‘హిట్` మ్యాన్ రిటైర్మెంట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES