నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలో గత కొన్ని రోజుల నుండి రౌడీషీటర్ గా చలామణి అవుతున్న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్ కు చెందిన ఆమీర్ అలీ ఖాన్ అలియాస్ బర్సాత్ అమేర్ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్ జిల్లా నుండి బహిష్కరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సదరు రౌడీషీటర్ నిజామాబాద్ జిల్లాలో వివిధ నేరాలు చేసి 22 కేసులలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. ఇతను గత 6 సంవత్సరాలుగా నేరాలకు పాల్పడుతూ జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అంతేకాకుండా ఒకసారి పీడీ యాక్ట్ (PD ACT) ను కూడా ప్రయోగించడం జరిగింది. ఇతను చాలాసార్లు జైలుకు వెళ్లినప్పటికీ ఇతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రావడం లేదు.
ఇతని వల్ల జిల్లాలో శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుంది. ఇందుకుగాను నిజామాబాద్ పోలీస్ కమీషనర్ గారికి ఉన్న అధికారాల మేరకు అండర్ సెక్షన్26(1)(ఏ) హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ -1348 ఫస్లీ చట్టం ప్రకారం శాంతి భద్రతల పరిరక్షణ కోరకు రానున్న ఎలక్షన్ దృష్ట్యా అట్టి ఆమీర్ అలీ ఖాన్ అలియాస్ బర్సాత్ అమేర్ రౌడీషీటర్ ను ఒక సంవత్సరం పాటు నిజామాబాద్ జిల్లా బహిష్కరణ చేసామన్నారు. జిల్లా బహిష్కరణకు కు సంబంధించిన పత్రాన్ని నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్ చేతుల మీదుగా రౌడీ షీటర్ బర్సాత్ అమేర్ అందించారు.



