Thursday, May 15, 2025
Homeట్రెండింగ్ న్యూస్నాంపల్లిలో రౌడీషీటర్‌ దారుణ హత్య

నాంపల్లిలో రౌడీషీటర్‌ దారుణ హత్య

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్‌ : నగరంలోని నాంపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రి వద్ద రౌడీషీటర్‌ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. చాంద్రాయణగుట్టకు చెందిన అయాన్‌ ఖురేషీ ఓ కేసు నిమిత్తం నాంపల్లి కోర్టుకు వచ్చాడు. అనంతరం తిరిగి వెళ్తుండగా ఐదుగురు దుండగులు అతన్ని వెంబడించారు. క్యాన్సర్‌ ఆస్పత్రి వద్ద తొలుత బ్యాట్‌తో దాడి చేశారు. అనంతరం కత్తులతో గొంతు కోసి పొట్టలో పొడిచి చంపారు. హత్యకు ఉపయోగించిన బ్యాట్‌, కత్తులను ఘటనాస్థలంలోనే వదిలి పరారయ్యారు. సమాచారం అందుకున్న నాంపల్లి పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -