- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే రూ.10 వేలు జరిమానా, గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష పడుతుందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. రేపటి నుంచి డిసెంబర్ 30 వరకు హైదరాబాద్ వ్యాప్తంగా ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ ఉంటుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై, మైనర్లకు వాహనం ఇచ్చిన యజమానులు, తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ పోలీసుల ప్రధాన లక్ష్యం రోడ్డు భద్రత అన్నారు.
- Advertisement -



