Wednesday, April 30, 2025
HomeUncategorizedరూ.2వేల కోట్ల స్కామ్‌.. ఆప్‌ నేతలపై ఏసీబీ కేసు

రూ.2వేల కోట్ల స్కామ్‌.. ఆప్‌ నేతలపై ఏసీబీ కేసు

నవతెలంగాణ న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ మంత్రులు, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు మనీశ్‌ సిసోడియా , సత్యేంద్ర జైన్‌లపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. ఆప్‌ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో 12,000 తరగతి గదులు, పాఠశాల భవనాల నిర్మాణంలో రూ. 2 వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు బయటపడింది. ఇందులో ఆప్‌ నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, మాజీ మంత్రి జైన్‌లు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు సిసోడియా, జైన్‌లపై కేసులు బుక్‌ చేశారు. అంతేకాదు ఈ స్కామ్‌లో ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్ల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ చీఫ్‌ మధుర్‌ వర్మ తెలిపారు.గత ఆప్‌ ప్రభుత్వంలో సిసోడియా విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. సత్యేంద్ర జైన్‌ ప్రజా పనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో ఢిల్లీలో 12,000 తరగతి గదులు, పాఠశాల భవనాలను నిర్మించారు. అయితే, వాటిని అధిక వ్యయంతో నిర్మించినట్లు గుర్తించారు. వీటి నిర్మాణంలో రూ.2 వేల కోట్లు అక్రమాలు జరిగాయని ఏసీబీ గుర్తించింది. ఈ పనులను 34 మంది కాంట్రాక్టర్లకు అప్పగించారని.. అందులో ఎక్కువ మంది ఆప్‌తో సంబంధాలు కలిగిన కాంట్రాక్టర్లే ఉన్నట్లు తేలింది. నిర్ణీత గడువులోపు నిర్మాణం పూర్తి కాలేదని.. దీని కారణంగా ఖర్చు భారీగా పెరిగిందని ఏసీబీ
తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img