Friday, March 20, 2026
E-PAPER
Homeజాతీయంబెంగాల్‌లో రూ.25 లక్షల నగదు సీజ్‌

బెంగాల్‌లో రూ.25 లక్షల నగదు సీజ్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న బెంగాల్లో లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈక్ర‌మంలో ఎన్నిక‌ల అధికారులు త‌నిఖీలు ముమ్మ‌రం చేశారు. కోల్‌కతాలో, ఈకో పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ-2 సమీపంలో వాహ‌నాల త‌న‌ఖీలు చేప‌ట్టారు. అనుమానాస్పద పరిస్థితుల్లో కారులో సోదాలు చేయ‌గా ఎలాంటి ఆధారాలు లేని రూ.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. డ్రైవ‌ర్‌ ఠాకూర్ సురాజీ అభేసాంగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు న‌మోదు చేసుకొని అధికారులు దర్యాప్తు చేప‌ట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -