- Advertisement -
బెంగళూరు : అంకిత్ ఆచార్య నేతత్వంలోని కాటియో కొత్తగా రూ.26 కోట్ల (3మిలియన్ డాలర్లు) నిధులు సమీకరించినట్టు తెలిపింది. అమల్ పారిఖ్ ఆధ్వర్యంలో ఈ రౌండ్‌లో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, వెంచర్ క్యాటలిస్ట్స్, విభా చేతన్, రవీన్ శాస్త్రి, వివేకానంద హల్లెకెరె, నిశ్చరు ఏజీ పాల్గొన్నారు. ఈ నిధులను రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బలోపేతం, సాంకేతిక విస్తరణకు ఉపయోగించనున్నట్టు ఆ సంస్థ సీఈవో అంకిత్ ఆచార్య తెలిపారు. రోడ్ భద్రత ఏ ఐ సేవలను అందించే తమ సంస్థ 46 నగరాలలో 60 పైగా కస్టమర్లతో పనిచేస్తోందన్నారు, 3 కోట్ల కిలోమీటర్ల సురక్షిత ప్రయాణాన్ని సాధించిందన్నారు. భారత రహదారులకు భయం కాదు, జవాబుదారీతనం, రక్షణ కావాలన్నారు.
- Advertisement -