– అంగన్వాడి కేంద్రాలకు నో
నవతెలంగాణ – బల్మూరు
గ్యాస్ సిలిండర్ల పై ఒక్కొక్కరి వద్ద 37 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని మండల కేంద్రం బల్మూరు గ్రామస్తులు గురువారం వాపోయారు. గురువారం అచ్చంపేట భారత్ గ్యాస్ బండి వస్తుందని ప్రతిసారి అదనంగా వసూలు చేస్తున్నారని అన్నారు. శుక్రవారం వచ్చే లింగాల గ్యాస్ బండి కూడా అందుకు మించి 57 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని వినియోగదారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వారిచ్చే బిల్లు రిసిప్ట్ ల మాత్రం 983 రూపాయలు వస్తుందని కానీ అందుకు అదనంగా వసూలు చేస్తున్నారని ఇదేమిటి అని ఎవరైనా అడిగితే వారిపై కోపగిస్తూ వేరే కారణాలను చెప్తూ వెళ్తారని అన్నారు.
ఓటిపి చెప్పలేక సామాన్యులు ఇబ్బందులు పడుతుండగా వారిపై చీదరించుకుంటూ సిలిండర్ కుండ రాలేదు పో అంటూ మాట్లాడతారని తెలిపారు. ఇదిలా ఉండగా అంగన్వాడి కేంద్రాలకు ఆన్లైన్ బుకింగ్ లేకున్నప్పటికీ సిలిండర్ఇ వ్వాలని ఉన్నప్పటికీ అంగన్వాడీ కేంద్రాలకు ఇవ్వడం లేదని చెప్తున్నారని.. అంగన్వాడి టీచర్లు తెలిపారు. సంబంధిత అచ్చంపేట ఏజెంట్ కు ఫోన్ చేసిన కలవడం లేదని విచారం వ్యక్తం చేశారు.
అంగన్వాడి కేంద్రాలకు ఒక నెలపాటు సిలిండర్లు ఇవ్వమని సిలిండర్ల సిబ్బంది తెలుపుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు తమకు తెలియదని వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి గ్రామాలలో సామాన్యుల వద్ద మరియు ఇతరుల వద్ద అధిక వసూళ్లను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అంగన్వాడి కేంద్రాలకు సిలిండర్లను పంపిణీ చేయాలని కోరారు.



