- Advertisement -
హైదరాబాద్ : ప్రభుత్వ రంగ విత్త సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా 2025-26 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 1.8 శాతం వృద్ధితో రూ.4,541.3 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.4,458 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.29,628 కోట్ల మొత్తం ఆదాయాన్ని ప్రకటించగా.. గడిచిన క్యూ1లో 4.9 శాతం వృద్ధితో రూ.31,091 కోట్ల ఆదాయాన్ని సాధించింది. బీఓబీ నికర వడ్డీ ఆదాయం 1.4 శాతం తగ్గి రూ.11,435 కోట్లుగా నమోద య్యింది. స్థూల నిరర్థక ఆస్తులు 2.88 శాతం నుంచి 2.28 శాతానికి తగ్గగా.. నికర ఎన్‌పీఏలు 0.69 శాతం నుంచి 0.6 శాతానికి పరిమితమయ్యాయి.
- Advertisement -