- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నేతన్న భరోసా పథకానికి ఈ ఏడాది రూ.48.80 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నేతలకు రూ.18వేలు, అనుబంధ కార్మికులకు రూ.6వేల చొప్పున రెండు విడతల్లో అందజేస్తామన్నారు. చేనేత కార్మికుల రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 6,780 మందికి రూ.లక్ష వరకు మాఫీ కానున్నట్లు పేర్కొన్నారు. 65 లక్షల ఇందిరమ్మ చీరలను నవంబర్ 15 నాటికి సిద్ధం చేయాలని సూచించారు.
- Advertisement -