నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిన ఘటన హిమాచల్ ప్రదేశ్ లో నేటి మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సర్కాఘాట్ సబ్-డివిజన్ పరిధి మసేరన్ లో 25 మంది ప్రయాణికులతో అతివేగంతో బస్సు దూసుకోళ్తోంది. ఈ క్రమంలో మండికి 65 కి. మీ దగ్గరలో బస్సు అదపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో తీవ్ర గాయాలతో ముగ్గురు మహిళలు సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మండి ఎస్పీ సాక్షి వర్మ మీడియాకు వెల్లడించారు.
RTC bus falls: లోయలో పడిపోయిన ఆర్టీసీ బస్సు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES