- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో ఆర్టీసీ ప్రత్యేక ప్యాసింజర్ వెయిటింగ్ లాంజ్‌ను అందుబాటులోకి తెచ్చింది. విమానాశ్రయం వద్ద పిల్లర్ నెం. 9 సమీపంలో ఏర్పాటు చేసిన ఈ లాంజ్‌ను సోమవారం ప్రారంభించారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సు కోసం వేచి ఉండేందుకు ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించారు. నేరుగా టికెట్లు కొనుగోలు చేసేందుకు, ఆన్‌లైన్ బుకింగ్ వివరాలు తెలుసుకునేందుకు, బస్సుల సమాచారం కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు గ్రేటర్ జోన్ ఈడీ రాజశేఖర్ తెలిపారు.
- Advertisement -



