Thursday, October 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనేడు ఆర్టీఐ 20వ వారోత్సవ వేడుకలు

నేడు ఆర్టీఐ 20వ వారోత్సవ వేడుకలు

- Advertisement -

– విజేతలకు బహుమతులు అందజేయనున్న గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) 20వ వారోత్సవ వేడుకలు గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరగనున్నాయి. ఆర్టీఐ 2025 విజేతలకు గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ బహుమతులు అందజేయనున్నారు. జనగామ, కామారెడ్డి, మెదక్‌, నిర్మల్‌, వనపర్తి, వరంగల్‌, జోగులాంబ గద్వాల్‌, వికారాబాద్‌, సిద్దిపేట, మహబూబాబాద్‌ మొదలైన జిల్లాల్లో సమాచార కమిషన్‌ ఈ ఏడాది అవగాహనా సదస్సులు నిర్వహించింది. గత పదకొండేండ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులను సైతం పరిష్కరించింది. ఈ క్రమంలో తెలంగాణ సమాచార హక్కుచట్టం వార్షికోత్సవాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -