- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బ్రిక్స్ సదస్సు వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక హెచ్చరికలు చేశారు. బ్రిక్స్ అనుకూల దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. బ్రిక్స్ దేశాలు అమెరికా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని ట్రూత్‌లో పోస్టు రాసుకొచ్చారు. ‘అమెరికా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బ్రిక్స్ అనుకూలంగా ఉన్న ఏదేశానికైనా అదనంగా 10 శాతం సుంకాలు విధిస్తాం. ఇందులో ఎలాంటి మినహాయింపులూ ఉండవు’ అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. బ్రెజిల్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేళ ట్రంప్ నుంచి ఈ హెచ్చిరకలు రావడం సంచలనంగా మారింది.
- Advertisement -