Wednesday, November 12, 2025
E-PAPER
Homeజాతీయంరూపాయి విలువ పతనం

రూపాయి విలువ పతనం

- Advertisement -

– డాలర్‌ రూ.86.07
ముంబయి:
మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతలు రూపాయి విలువను పడేశాయి. ముడి చమురు ధరల పెరుగుదల, స్టాక్‌ మార్కెట్ల పతనం రూపాయి విలువపై ఒత్తిడిని పెంచాయి. ఈ నేపథ్యంలోనే గురువారం అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ 55 పైసలు పతనమై 86.07కి దిగ జారింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ మార్కెట్‌లో 86.25 వద్ద తెరుచుకున్న రూపాయి విలువ.. ఇంట్రాడేలో 85.92- 86.25 కదలాడింది. ఇజ్రాయి ల్‌, ఇరాన్‌ మధ్య ఆందోళనల నేపథ్యంలో చమురు ధరలు పెరగొచ్చనే అంచనాల్లో ఫారెక్స్‌ ట్రేడర్లు డాలర్ల ను ఎక్కువ కొనుగోలు చేయడంతో రూపాయిపై ఒత్తిడి చోటు చేసుకుంది. మరోవైపు ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌ఐఐలు తరలిపోవడం దేశీయ కరెన్సీ పడిపోవడానికి ప్రధాన కారణమని ఫారెక్స్‌ ట్రేడర్లు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -