డాలర్‌తో 61 పైసలు పతనం
88.19 ఆల్‌టైం
కనిష్ట స్థాయికి చేరిక
అగాథంలోకి రూపాయి
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి వెలవెల పోతోంది. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ 88 స్థాయిని దాటింది. భారత్‌పై అమెరికా వేసిన భారీ టారిఫ్‌లకు తోడు, విదేశీ నిధుల బయటకు తరలిపోవడం, నెలాఖరు కావడంతో దిగుమతిదారులు డాలర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపడం తదితర పరిణామాలు రూపాయి విలువను అగథంలోకి పడేశాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 61 పైసలు పతనమై 88.19కి దిగజారింది. ఫారెక్స్‌్ మార్కెట్‌లో ఉదయం 87.73 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ ఓ దశలో 88.33 అత్యల్ప స్థాయికి పడిపోయింది. ఇంతక్రితం ఫిబ్రవరి 10న ఇంట్రాడేలో 87.95 వద్ద నమోదయ్యింది. ఆగస్టు 5న 87.88 కనిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత భారీ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. రూపాయి విలువ పతనం అంతర్జాతీయ మార్కెట్‌లో దిగుమతులను భారం చేయనున్నాయి. మరోవైపు విదేశీ చెల్లింపుల భారం పెరగనుంది. అంతిమంగా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరగనుంది. ”అమెరికా విధించిన భారీ సుంకాలు భారత వాణిజ్య లోటును పెంచుతాయని ఆందోళన కలిగిస్తున్నాయి. దెబ్బతిన్న దేశీయ మార్కెట్లు, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్నాయి.” అని మిరే అసెట్ షేర్‌ఖాన్‌లోని కరెన్సీ అండ్ కమాడిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ అనుజ్ చౌధరి పేర్కొన్నారు.
అగాథంలోకి రూపాయి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES