నవతెలంగాణ-హైదరాబాద్: రష్యా ముడి చమురును సేకరిస్తున్న భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాలు విధించడాన్ని భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయం బుధవారం తీవ్రంగా విమర్శించింది. భారత్ నుండి వస్తువులు అమెరికా మార్కెట్‌కు వెళ్లలేకపోతే, వారు రష్యాకు ఎగుమతి చేయవచ్చని తెలిపింది. అమెరికా ఆంక్షలు ద్వంద్వ ప్రమాణాలను ప్రదర్శిస్తున్నాయని, జాతీయ ప్రయోజనాలను విస్మరించాయని విమర్శించింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి ఆటంకం కలిగించే అడ్డంకులను తొలగించాలనే రష్యా దృఢసంకల్పాన్ని రాయబార కార్యాలయ అధికారి స్పష్టం చేశారు. రష్యా ముడి చమురును కోనుగోలు చేయవద్దని భారత్‌పై ఒత్తిడి సహేతుకం కాదని మండిపడ్డారు.
ఈ ఏడాది చివరి నాటికి ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు సమావేశం కానున్నారని భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. అయితే షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని అన్నారు. చెల్లింపు వ్యవస్థలను మెరుగుపరచడం, వాణిజ్య అడ్డంకులను తొలగించడం ద్వారా భారత్‌తో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయాలన్న రష్యా లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రకటన వెలువడింది.
రష్యా ముడి చమురుపై భారత్‌కు సుమారు 5శాతం తగ్గింపు వస్తోందని, దీంతో భారత్‌కు లాభం ఎక్కువని, కొనుగోళ్లను మార్చుకునే అవసరం లేదని భారత్ నిర్ణయించుకుందని రాయబార కార్యాలయం పేర్కొంది. రష్యా ముడిచమురుకు ప్రత్యామ్నాయం లేదని, పోటీతత్వం కలిగి ఉందని తెలిపింది. భారత్ రష్యాకు చాలా ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి అని కూడా పేర్కొంది. ట్రంప్ విధించిన 25శాతం అదనపు సుంకం ఉద్రిక్తతలకు మరింత బలం చేకూరుస్తోందని విమర్శించింది. రష్యాతో భారత్‌చమురు వాణిజ్యాన్ని రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్ష ఆర్థిక సాయంగా అమెరికా చూస్తోందని మండిపడింది. వాణిజ్య కార్యకలాపాలను సులభతరం చేయడానికి భారత్‌తో మెరుగైన చెల్లింపు విధానాలను అభివృద్ధి చేయడానికి నిబద్ధత కలిగి ఉన్నట్లు రష్యా రాయబార కార్యాలయం పేర్కొంది. ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ.. ఈ రెండు దేశాలు తమ బలమైన ఆర్థిక భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు కృషి చేస్తున్నందున ఈ చర్య చాలా ముఖ్యమైనదని పేర్కొంది.
ద్వైపాక్షిక సంబంధాలపై రాయబార కార్యాలయ ప్రతినిధి విశ్వాసం వ్యక్తం చేశారు. ఇబ్బందులు ఎదురైనపుడు కూడా సమర్థవంతంగా కలిసి పనిచేయడానికి ఇరు దేశాలు నిరంతరం మార్గాలను కనుగొన్నాయని అన్నారు. పుతిన్, మోడీల మధ్య జరగబోయే సమావేశం రెండు దేశాల మద్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. వాణిజ్యం, రక్షణ మరియు సాంకేతికత సహా వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారం కోసం ఇరువురు నేతలు గతకొన్నేళ్లుగా సన్నిహిత దౌత్య