Saturday, January 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం: అబుదాబిలో శాంతి చ‌ర్చ‌లు

ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం: అబుదాబిలో శాంతి చ‌ర్చ‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: 2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రెండు దేశాల యుద్ధం ముగింపు ప‌ల‌కాల‌ని, శాంతి నెల‌కొల్పాల‌ని ప‌లు దేశాలు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఇప్ప‌టికే అనేక ద‌ఫాలుగా వివిధ ప్రాంతాల్లో ఆ రెండు దేశాల ప్ర‌తినిధుల‌తో చర్చ‌లు జ‌రిపారు. అయినా కానీ ఫ‌లితం త‌గ్గ‌డంలేదు. తాజాగా మరోసారి ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. అబుదాబిలో రెండు దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. తాజా శాంతి చర్చలకు సంబంధించి అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తోంది.

శాంతి చర్చలు సందర్భంగా తమ దేశ భద్రతకు యూరప్ హామీ ఇవ్వాలని జెలెన్ స్కీ కోరుతున్నాడు. శాంతి ఒప్పందం విషయంలో రష్యా మాత్రం కాస్త ఆలోచించి అడుగులేస్తోంది. ఉక్రెయిన్ లోని కీలక ప్రాంతమైన డోనెస్క్ ప్రాంతాన్ననని తన ఆధీనంలో ఉంచుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ కోరుతున్నాడు. కానీ, దీనికి జెలెన్ స్కీ అంగీకరించడం లేదు. ఈ ప్రదేశం దాదాపు 5,000 చదరపు కిలోమీటర్లు ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -