- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రష్యాలోని టాప్ ఎనర్జీ కంపెనీలపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో భారత రిఫైనరీలు కొత్తగా ఆయిల్ దిగుమతులపై వెనుకడుగు వేస్తున్నాయి. పేమెంట్లు నిలిచిపోయే ప్రమాదం ఉండటమే ఇందుకు కారణం. ఈ విషయంలో ప్రభుత్వం, సప్లయర్ల నుంచి క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఫ్రెష్ ఆయిల్ టెండర్ జారీ చేసిందని, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పాట్ బయ్యింగ్‌కు సిద్ధమైందని తెలిసింది.
- Advertisement -



