Sunday, March 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఖమేనీ హత్య.. ఖండించిన రష్యా అధ్యక్షుడు పుతిన్..

ఖమేనీ హత్య.. ఖండించిన రష్యా అధ్యక్షుడు పుతిన్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ హత్యను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఖండించారు. ఖమేనీ హత్య నిరంకుశ చర్యగా అభివర్ణించారు. ఈ మేరకు ఆదివారం పుతిన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఖమేనీ హత్య నిరంకుశమైంది. నైతిక విలువలు, అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘించి హత్య చేశారు. ఖమేనీ కుటుంబానికి, ఆయన సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి. రష్యా ఎప్పుడూ ఖమేనీని గుర్తంచుకుంటుంది. ఆయన తన అద్భుతమైన పాలనతో ఇరుదేశాల మధ్య సంబంధాల పెంపునకు కృషి చేశారు’’ అంటూ పుతిన్ పేర్కొన్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌కు పుతిన్ తన సంతాప సందేశాన్ని పంపించారు. ఖమేనీ హత్యను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -