Monday, February 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి.. 15 మంది మృతి

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి.. 15 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి దాడి చేసింది. తాజాగా నిప్రో నగరంపై జరిపిన డ్రోన్‌ దాడిలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. మృతులను గని కార్మికులుగా గుర్తించారు. ఆ బస్సు తమదేనని ఉక్రెయిన్‌లోని అతిపెద్ద విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ డీటీఈకే తెలిపింది. నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలోని డీటీఈకే గనులపై రష్యా పెద్దఎత్తున ఉగ్రదాడికి పాల్పడిందని ఆరోపించింది. ఈ క్రమంలోనే షిఫ్ట్‌ ముగిసిన అనంతరం ఇంటికి బయల్దేరిన కార్మికుల బస్సుపై డ్రోన్‌ దాడి జరిగినట్లు తెలిపింది. ఘటనాస్థలంలో మంటలు చెలరేగినట్లు వెల్లడించింది. కనిష్ఠ ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉక్రెయిన్‌పై దాడులను తాత్కాలికంగా ఆపేందుకు రష్యా అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ఈ దాడి జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -