Sunday, April 12, 2026
E-PAPER
Homeఆటలురుతురాజ్ గైక్వాడ్‌కు జరిమానా

రుతురాజ్ గైక్వాడ్‌కు జరిమానా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు జరిమానా పడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకుగాను అతడికి రూ. 12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. ఈ సీజన్‌లో సీఎస్కే జట్టుకు ఇది తొలి తప్పిదం కావడంతో కెప్టెన్ గైక్వాడ్‌కు రూ. 12 లక్షల జరిమానాతో సరిపెట్టినట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా, ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాకు గురైన మూడో కెప్టెన్‌గా గైక్వాడ్ నిలిచాడు. ఇంతకుముందు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రెండుసార్లు, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఒకసారి ఈ తప్పిదానికి పాల్పడ్డారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -