– క్యాండిల్ ర్యాలీతో పోలీస్ అమరవీరులకు నివాళులు
– జిల్లా ఎస్పి డాక్టర్ వినీత్ (ఐపీస్) ఉత్తర్వుల మేరకు
నవతెలంగాణ-మక్తల్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ (పోలీస్ ప్లగ్ డే) వారోత్సవాల్లో భాగంగా మక్తల్ పట్టణ కేంద్రంలో పోలీస్ స్టేషన్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు పోలీసులు, యువత అందరూ కలిసి క్యాండిల్ ర్యాలీ నిర్వహించి పోలీస్ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా మక్తల్ సీఐ రామలాల్ మాట్లాడుతూ.ప్రజాల రక్షణలో శాంతిభద్రతల పరిరక్షణలో నిబద్ధతతో బాధ్యతలు నిర్వర్తిస్తూ విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సంఘవిద్రోహశక్తులచే పోరాడి వీర మరణం పొందిన పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ జోహార్ పోలీస్ అమరవీరులకు జోహార్ జోహార్ అంటూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించి పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ 2 రేవతి,పోలీసులు, యువత, ప్రజలు మొదలగువారు పాల్గొన్నారు.
పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేని: మక్తల్ సీఐ రామ్ లాల్
- Advertisement -
- Advertisement -



