Wednesday, April 8, 2026
E-PAPER
HomeNewsసాదిక్ పాష మృతి బాధాకరం 

సాదిక్ పాష మృతి బాధాకరం 

- Advertisement -

నవతెలంగాణ-గోవిందరావుపేట 
పోస్ట్ ఆఫీస్ ప్యాకర్ సాదిక్ పాషా మృతి బాధాకరమని టిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ జిల్లా నాయకులు భూక్య జంపన్న అన్నారు. బుధవారం మండలంలోని పసర గ్రామంలో మృతుడు పాష మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి జంపన్న మాట్లాడారు. సాదిక్ పాషా గత 35 సంవత్సరాలకు పైబడి పసర గ్రామంలో పోస్ట్ ప్యాకర్ విధులు నిర్వర్తిస్తూ స్థానిక ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. పాష మృతి చెందిన పాషాతో ఉన్న సంబంధాలు చిరస్మరణీయంగా ఉండిపోతాయని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు లకావత్ నరసింహ నాయక్,అజ్మీరా సురేష్ నాయక్, భూక్య మోహన్ నాయక్ , రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -