Saturday, June 14, 2025
E-PAPER
Homeఆటలుసఫారీలు 138/10

సఫారీలు 138/10

- Advertisement -

– 2025 డబ్ల్యూటీసీ ఫైనల్‌
లండన్‌:
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. కగిసో రబాడ (5/51) దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 56.4 ఓవర్లలో 212 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా… దక్షిణాఫ్రికాను 138 పరుగులకే ఆలౌట్‌ చేసింది. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ (6/28) ఆరు వికెట్లతో విజృంభించటంతో ఆసీస్‌ 74 పరుగుల విలువైన ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 38.2 ఓవర్లలో 134/8 పరుగులు చేయగా.. ఆ జట్టు ఆధిక్యం 208 పరుగులకు చేరుకుంది. పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై 200 ప్లస్‌ టార్గెట్‌ను ఛేదించటం సఫారీలకు కఠిన సవాల్‌గా నిలువనుంది. అలెక్స్‌ కేరీ (43 నాటౌట్‌), మార్నస్‌ లబుషేన్‌ (22) ఆసీస్‌ను ముందుండి నడిపించారు. లుంగి ఎంగిడి, రబాడ మూడేసి వికెట్లు పడగొట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -