నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఫీవర్ హాస్పిటల్ సమీపంలోని తిలక్ నగర్ చౌరస్తాలో ప్రధాన రహదారిపై భారీ గుంత ఏర్పడింది. వాహనాల రద్దీ ఎక్కువ ఉన్న సమయంలోనే గుంత ఏర్పడటంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. సమాచారం అందిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు స్పందించి వాహనాలను నిలిపివేశారు. బారీకేడ్లు ఏర్పాటు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ గుంత కింద నాలా ప్రవహిస్తోంది. అయితే సరిగ్గా ఆరు నెలల క్రితం ఇదే చోట రోడ్డు కుంగిపోవడంతో తిరిగి నిర్మించారు. ఇప్పుడు మళ్లీ కుంగిపోవడంతో కాంట్రాక్టర్ పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇక గుంత ఏర్పడంపై పోలీస్ శాఖ స్పందించింది. వాటర్ లీకేజ్ కారణంగా గుంత ఏర్పడినట్టు తెలిపింది. రెండు రోజులపాటు అక్కడ మరమ్మత్తులు జరుగుతాయని పేర్కొంది. కాబట్టి ఆ వైపు వచ్చే బస్సులు, ఇతర భారీ వాహనాలు ప్రత్యామ్నాయమార్గాల గుండా వెళ్లాలని సూచించింది.
హైదరాబాద్‌లో కుంగిపోయిన రోడ్డు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



