– సహార ఇండియా కంపెనీ ఖాతాలో జమ చేసిన డబ్బులను తక్షణమే బాధితులకు చెల్లించాలి : జేఏసీ నాయకులు
– సహారా ఏజెంట్లకు పోలీసు వ్యవస్థ రక్షణ కల్పించాలి- TRP పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సంబేటి సుమన్
నవతెలంగాణ – ధర్పల్లి : మండల కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయం ముందు సహారా బాధితులతో ధర్నా కార్యక్రమం నిర్వహించి ధర్పల్లి మండలం తహసిల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సంబేటి సుమన్ మాట్లాడుతూ… నిరుపేదలను టార్గెట్ చేసి అధిక మొత్తాలను ఆశగా చూపి దేశంలో సహార కంపెనీ లో డబ్బులు జమ చేయించుకొని తిరిగి ఇవ్వకుండా సహారా కంపెనీ కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ ప్రజల జీవితంలో చీకటి నింపిందన్నారు. పేదల రక్తపు మాంసం ముద్దులతో సంపాదించిన డబ్బులు సహారా ఇండియా కంపెనీ ముంచిందన్నారు.
ప్రజల జీవితాలతో చెలగాటమాడే నాన్ బ్యాంకింగ్,బ్యాంకింగ్ రంగంపై ఎప్పటికప్పుడు ప్రభుత్వ నిగా లేకపోవడమే ఈరోజు సహార పరిస్థితి ఈ విధంగా తయారైంది అన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఖాతాదారులు పోరాటాలు చేస్తున్న ప్రభుత్వానికి చలనం లేకపోవడం శోచనీయమన్నారు. ప్రతి పార్లమెంటు సమావేశంలో ఎంపీలు ఖాతాదారుల డబ్బుల్ని తిరిగి ఇయ్యాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం తప్ప మరొకటి కాదన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ కో కన్వీనర్ చెలిమెల నరసయ్య మాట్లాడుతూ… కూలి నాలి చేసుకొని భవిష్యత్తులో పనికొస్తాయని కొండంత ఆశతో సహారా కంపెనీలో పొదుపు చేసుకుంటే ఆ డబ్బులు దిక్కుమొక్కు లేకుండా పోయాయని అన్నారు.పేదల ప్రభుత్వమని నరేంద్ర మోడీ చెప్తున్నప్పటికీ పేదలకు అన్యాయం చేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు.
పేదల వైపు కాకుండా బడా పెట్టుబడిదారుల కు అనుకూలంగా విధానాలు తీసుకొస్తూ వాళ్ళ జేబులు నింపుతున్నారని అన్నారు. సహారా ఇండియా బాధితుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి బాలయ్య మాట్లాడుతూ… గత పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోడీ అమిత్ షా ప్రతి బహిరంగ సభలో మేము అధికారంలోకి రాగానే ప్రతి ఖాతాదారునికి పైసా మునగకుండా చెల్లిస్తామని హామీ ఇచ్చి రెండున్నర సంవత్సరాలు కాలం గడుస్తున్న సహార సమస్యను పరిష్కారం మార్గం వైపు అడుగులు వేస్తున్నట్టు దాఖలు లేవు దేశంలో 13 కోట్ల ఖాతాదారుల మూడు లక్షల కోట్లకు పైగా సహారా సంస్థలో ఉండిపోయాయి.
సి ఆర్ సి ఎస్ పోర్టల్ ద్వారా 2023 ఇస్తామని అమిత్ షా గారు ప్రకటిస్తే నాలుగు కోట్ల మంది ఖాతాదారులు ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే కేవలం 40 లక్షల మందికి పదివేల కోట్లు మాత్రమే చెల్లిస్తూ కాలయాపన చేస్తున్నారనీ అన్నారు. ఎన్నో ఆశలతో పొదుపు చేసుకున్నరు భవిష్యత్తులో పిల్లల పెళ్లిలకు, చదువుకు, గృహ నిర్మాణ లకు వైద్యం కు వస్తాయని కొండంత ఆశతో సహారా కంపెనీలో డిపాజిట్ చేస్తే ఆశలన్నీ అడియాశలు గా మిగిలిపోయాయనీ అన్నారు. పేదల ప్రభుత్వమని నిత్యం ఉపన్యాసాలు దంచే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 13 కోట్ల ఖాతాదారుల సమస్య కంటికి కనబడతలేదని అడుగుతున్నాము ఇప్పటికీ దేశంలో పదివేల పైగా ఖాతాదారులు మరణించారు.
ఎంతోమంది అనారోగ్యాలకు గురవుతున్నారనీ అన్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ఖాతాదారుల డబ్బులు ఖాతాదారులకి ఇవ్వాలని గత ఐదు సంవత్సరాలు నుంచి పోరాటం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం. ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు మహిపాల్ మాట్లాడుతూ… సహార సంస్థలు నిత్యం కూలి నాలు చేసుకునే వారే ఎక్కువ ఖాతాదారులు ఉన్నారని వాళ్ళ డబ్బులే పెట్టుబడిదారులు ఎగ్గొడుతున్నారని ఈ ప్రభుత్వాలు ధనిక వర్గాలకే కుడిగం చేస్తున్నాయని అన్నారు ఇప్పటికైనా వారి డబ్బులు వారికి చెల్లించి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ 13 పార్టీ మండల నాయకులు నర్సాగౌడ్,లక్ష్మణ్,బోన్ల నరసయ్య జేఏసీ నాయకులు కిరణ్ గౌడ్, రాజేశ్వర్,ఫయాస్,సిద్దేశ్వర్ ఖాతాదారులు పాల్గొన్నారు.



