- Advertisement -
గూర్‌గావ్ : సామ్‌సంగ్ సెమీకండక్టర్ ఇండియా రీసెర్చ్ (ఎస్‌ఎస్‌ఐఆర్) కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో తమ తొలి ”శామ్‌సంగ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్”ను ప్రారంభించినట్టు తెలిపింది. ఇందులో సైబర్ సెక్యూరిటీ, ఆటోమేషన్, రోబోటిక్స్, కోర్ ఇంజనీరింగ్‌లలో ప్రయోగాత్మక శిక్షణ కోసం ఐదు అత్యాధునిక ప్రయోగశాలల ఏర్పాటుకు మద్దతు అందిస్తోన్నట్లు పేర్కొంది. మారుమూల ప్రాంతాల యువతను శక్తివంతం చేయడం, విద్యా నాణ్యతను మెరుగుపరచడం, శాస్త్రీయ ఆవిష్కరణలకు మద్దతునిచ్చే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఎస్‌ఐఆర్ ఈవీపీ, ఎండీ బాలాజీ సౌరిరాజన్ తెలిపారు.
- Advertisement -