Tuesday, April 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మత్స్య సంపద యోజన కింద వాహనాల మంజూరు

మత్స్య సంపద యోజన కింద వాహనాల మంజూరు

- Advertisement -

– లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక
నవతెలంగాణ – కామారెడ్డి : ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద కామారెడ్డి జిల్లాకు వివిధ కేటగిరీలలో మొత్తం 13 వాహనాలను మంజూరు చేశారు. ఇందులో జనరల్ కేటగిరీకి 8, ఎస్సీ కేటగిరీకి 2, ఎస్టీ కేటగిరీకి 1, మహిళా కేటగిరీకి 2 వాహనాలు కేటాయించారు.

ఈ వాహనాల కోసం మొత్తం 113 దరఖాస్తులు అందాయి. జనరల్ కేటగిరీ కింద 8 వాహనాలకు 109 దరఖాస్తులు రావడంతో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గానికి 2 వాహనాల చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లాటరీ విధానం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ ప్రక్రియ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) మధు మెహన్ సమక్షంలో, జిల్లా స్థాయి కమిటీ సభ్యులు, మత్స్య శాఖ అధికారులు, దరఖాస్తుదారుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించారు. లాటరీ ద్వారా ఎంపికైన 8 మంది లబ్ధిదారులకు డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) సమర్పించేందుకు ఒక వారం గడువు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -