Monday, September 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగూడ్స్‌ రైలును ఆపిన సంగెం కలాన్‌ గ్రామస్తులు

గూడ్స్‌ రైలును ఆపిన సంగెం కలాన్‌ గ్రామస్తులు

- Advertisement -

– వరదనీటితో మునిగిన ఎస్సీ కాలనీ
– చిట్టినాడు సిమెంటు కర్మాగారానికి
– రైల్వే ట్రాక్‌ ఏర్పాటుతోనే సమస్య : బాధితులు
నవతెలంగాణ-తాండూరు

ఇండ్లలోకి వర్షపు నీరు రావడానికి రైల్వే ట్రాకే కారణమని నిరసిస్తూ.. వికారాబాద్‌ జిల్లా తాండూర్‌ మండలం సంగెం కలాన్‌ గ్రామస్తులు ఆదివారం రైల్వే ట్రాక్‌పై కూర్చొని గూడ్స్‌ రైలును అడ్డుకున్నారు. వరద నీటిలో తమ కాలనీ మునిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంగెం కలాన్‌ గ్రామం మీదుగా చిట్టినాడు సిమెంట్‌ కర్మాగారం నిర్వాహకులు రైల్వే ట్రాక్‌ను ఏర్పాటు చేశారన్నారు. ఏర్పాటు సమయంలో 13 ఫిల్లర్స్‌తో ట్రాక్‌ నిర్మిస్తామని చెప్పి, కేవలం 3 ఫిల్లర్లతో ముగించినట్టు తెలిపారు. ఈ కారణంగానే ఆ ట్రాక్‌కు ఆనుకుని ఉన్న ఎస్సీ కాలనీలోకి వరద వస్తోందన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో సుమారు 200 ఇండ్లు నీటమునిగాయని ఆవేదన వ్యక్తంచేశారు. నిర్మాణ సమయంలో తమ కాలనీ పక్క నుంచి ట్రాక్‌ ఏర్పాటు చేయొద్దని అప్పటి కలెక్టర్‌కు 40 సార్లు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోలేదన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతోనే తమ కాలనీ మునిగిపోయిందని తెలిపారు. ఇండ్లలోకి వరద నీరు చేరడంతో నిత్యావసర సరుకులన్నీ తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆవేదనతోనే రైల్వే ట్రాక్‌పై బైటాయించి నిరసన తెలుపుతున్నామన్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌ స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -